ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం 

నా ఓర్పును పరీక్షించవద్దు.. నోరు జారితే ఊరుకునేది లేదు

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, తనపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. పార్టీ జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని లేఖ ఇచ్చిన జేసీ..  ఇప్పుడేమో వైయ‌స్ఆర్ సీపీ జెండాలు తొలగించాలని ఆందోళన చేయడం హాస్యాస్పదమ‌న్నారు. జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధ‌మ‌న్నారు. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టాడ‌ని, నోరు జారితే ఊరుకునేది లేదని, జేసీ వర్గీయులు త‌న‌ ఓర్పును పరీక్షించవద్దని హెచ్చ‌రించారు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు టీడీపీ నేత‌లు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిప‌డ్డారు. 

Back to Top