ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు

ప‌శ్చిమ గోదావ‌రి: తమ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను జంతువులతో పోల్చారని ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా తణుకు, నరసాపురం పోలీస్‌స్టేషన్లలో  ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లుతున్నారంటూ ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Back to Top