ఎన్టీఆర్‌ను, టీడీపీని మింగేసిన అనకొండ చంద్రబాబు

రెండెకరాల నుంచి రూ.20 లక్షల కోట్లకు బాబు ఎలా ఎదిగాడు..?

నా ఆస్తులపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..?

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

జ‌గ్గంపేట‌: చంద్రబాబు రెండెకరాల నుంచి రూ.20 లక్షల కోట్ల ఆస్తులకు ఎలా ఎదిగారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రశ్నించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను, పాత తెలుగుదేశం పార్టీని మింగేసిన అనకొండ చంద్రబాబు అని ఫైరయ్యారు. ఆస్తులపై చర్చకు చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధమా అని సవాలు విసిరారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు సరికాదన్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను ఆదరించి రాజకీయ భిక్ష పెట్టారని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నోటికివచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందనుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్యపదజాలంతో మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ వ్యభిచారులు, బ్యాంకులను దోచేసిన వారు జగ్గంపేటకు చంద్రబాబును పిలిపించుకొని టీడీపీని బతికించుకోవాలని తాపత్రయపడుతున్నారని, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో సమాధి అయ్యిందన్నారు. జగ్గంపేటకు వచ్చి నోటికి వచ్చినట్టుగా మాట్లాడే చంద్రబాబు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరో చెప్పగలరా..? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో టీడీపీతో ఎవరు ప్రయాణం చేస్తారో కూడా నమ్మకం లేని పరిస్థితి ఉందని, ఆ అభద్రతాభావం, ప్రస్టేషన్‌తో చంద్రబాబు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. 
 

Back to Top