అమరావతి: చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలే తిప్పికొడతారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఎల్లో మీడియా చేతుల్లో ఉంది కదా అని దీక్ష చేస్తున్నావా..? ఏ వర్గానికి అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 14వ తేదీన చంద్రబాబు దీక్ష చేస్తారంట.. బాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు ఎవరూ హర్షించరన్నారు. ప్రత్యేక హోదా కోసం దొంగ దీక్షలు చేశాడు.. ఆ దీక్షలను ఈసడించుకున్న ప్రజలు టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. బాబు చేసే దొంగ దీక్షలను ప్రజలే తిప్పికొడతారన్నారు. పిచ్చివాళ్లలా పవన్, చంద్రబాబు ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పాదయాత్ర ఆంధ్రరాష్ట్ర స్థితిగతులను మార్చిందన్నారు. వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి కుటుంబం నా కుమారుడు, నా తమ్ముడు అని పాదయాత్ర చేస్తున్నాడని భావించారన్నారు. మహాప్రస్థానం పేరుతో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, పేదల బతుకులు మార్చారన్నారు. అదే విధంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఐదు నెలల కాలంలోనే కులం, మతం, వర్గం, పార్టీ, రాజకీయం లేకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలని ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పాలన సాగిస్తున్నాడన్నారు. పాదయాత్రతో చరిత్ర సృష్టించారు: ఎమ్మెల్యే ఉదయభాను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రతో ఒక చరిత్ర సృష్టించాడని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ ఐదు నెలల్లోనే ప్రజారంజక పాలన అందిస్తున్నాడన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. మేనిఫెస్టోలోని హామీలను ఐదు నెలల్లోనే 90 శాతం నెరవేర్చారన్నారు. Read Also: ఇద్దరి కొడుకులతో ప్రతిఫలం లేదని.. బాబే స్వయంగా..