చంద్రబాబు రాయలసీమ ద్రోహి 

ఎమ్మెల్యే హాఫిజ్‌ఖాన్
 

కర్నూలు:  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఎమ్మెల్యే హాఫిజ్‌ఖాన్ విమ‌ర్శించారు. చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాంతాన్ని వివక్షకు గురి చేశార‌ని మండిప‌డ్డారు. అమరావతి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. మరోసారి రాయలసీమ వాసులను మోసం చేస్తున్నారని విమ‌ర్శించారు. అమరావతి రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు ఆ అవినీతి బయటకొస్తుందనే భయంతోనే బస్సు యాత్ర డ్రామాకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. అమరావతి భూముల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ భయంతోనే చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు.  ఇప్పటికే తెలంగాణలో టీడీపీ క్లోజ్‌ అయ్యిందని, ఇక ఏపీలో కూడా క్లోజ్‌ ఖావడం ఖాయమన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దీనిని అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ బురద జల్లుతుందన్నారు.

‘అమరావతి భూములను చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసి అవినీతికి పాల్పడ్డారు. ఇది బయటకు వస్తుందనే చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమలో అడుగుపెట్టే హక్కును కోల్పోయారు. కర్నూలుకు రావాల్సిన రాజధానిని చంద్రబాబు అమరావతికి తరలించారు. 9 ఏళ్లు హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకరణ చేసి తప్పు చేశారు. అదే తప్పును అమరావతిలోనూ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీనికి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. 
 

తాజా వీడియోలు

Back to Top