బాబూ నీది హైదరాబాదా..? ఉండవల్లా..? కుప్పమా..?

టీడీపీని ప్రజలు ఎప్పుడో పీకిపారేశారు

పేదలకు మేలు జరిగితే ఓర్వలేని నీచుడు చంద్రబాబు

ఐదేళ్లు అధికారంలో ఉండి జీవీఎంసీ ఎన్నికలు పెట్టలేని దద్దమ్మ

14 ఏళ్ల పాలనలో విశాఖకు చేసిన మంచిపై శ్వేతపత్రం విడుదల చేయగలవా..?

ప్రధాని మోడీ పేరు పలకలేని పిరికిపంద చంద్రబాబు

విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతానికి పైగా సీట్లు సాధిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: పేదలకు మంచి జరిగితే ఓర్వలేని నీచుడు చంద్రబాబు అని, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం విశాఖలో 2 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తట్టుకోలేక కోర్టుకెళ్లి అడ్డుకున్నాడని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. విశాఖపట్నం అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే చంద్రబాబుకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబును సొంత నియోజకవర్గ ప్రజలే నమ్మడం లేదన్నారు. లోకేష్‌ను మంగళగిరిలో పీకేశారని, రాబోయే కాలంలో ప్రతిపక్ష నేత హోదాను కూడా ప్రజలు పీకేయబోతున్నారని, సర్పంచ్‌ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీడీపీ జెండా లేకుండా రాష్ట్ర ప్రజలే పీకేశారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని, ప్రధాని మోడీ పేరు ఎత్తితే టీడీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోతున్నాయా..? మోడీ పేరు పలకలేని పిరికిపంద చంద్రబాబు అని మండిపడ్డారు.

విశాఖలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘విశాఖ అభివృద్ధిని అడ్డుకునే నాయకులు వచ్చి.. ఈ రోజు ఓట్లు అడుగుతున్నారు. దయచేసి 19 లక్షల విశాఖ ఓటర్లు ఆలోచన చేయాలని కోరుతున్నాం. విశాఖలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుకుంది. 2 లక్షల మందికి పట్టాల పంపిణీ చేసి ఉంటే ఈపాటికి కొత్త నగరం ఏర్పాటయ్యేది. 

మొన్న కొడుకు, నేడు తండ్రి వచ్చి విశాఖ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. 14 సంవత్సరాల జీవీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. కనీసం గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ ఎన్నికలు పెట్టాలనే ధైర్యం చేయని దద్దమ్మ చంద్రబాబు.. 

స్థానిక సంస్థలు బలోపేతం అయితే రాష్ట్రం, పట్టణాలు బాగుపడతాయని సీఎం వైయస్‌ జగన్‌ ముందుకువచ్చి ఎన్నికలు పెడుతున్నారు. ఎక్కడా లేని విధంగా అన్ని వార్డుల్లో అభ్యర్థులు నిలబెట్టగలిగాం అని చెప్పుకునే స్థాయికి చంద్రబాబు దిగజారాడు. పంచాయతీ ఎన్నికల్లో నూటికి 80 శాతానికి పైగా సీట్లు వైయస్‌ఆర్‌ సీపీకి ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పకుండా నూటికి 90 శాతం ఫలితాలను ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీకి ఇస్తారనే నమ్మకం మాకుంది. మొన్న జరిగిన 600 ఏకగ్రీవాల్లో 590 వైయస్‌ఆర్‌ సీపీవి. 

14 ఏళ్లు సీఎంగా ఉండి విశాఖకు చేసిన మంచి కార్యక్రమాలు ఇవీ అని శ్వేతపత్రాన్ని విడుదల చేయగలవా చంద్రబాబూ..? విశాఖనే చంద్రబాబు వాడుకున్నాడు.. కానీ, ఏమీ చేయలేదు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా..? ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా..? మోడీ పేరు పలకడానికి ధైర్యం చేయని పిరికిపంద చంద్రబాబు. ఓట్లు వేయొద్దని చెప్పాలనుకుంటే బీజేపీకి, జనసేనకు వేయొద్దు అని చెప్పాలి. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ వీల్లేదని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం చెప్పారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నీది హైదరాబాదా..? ఉండవల్లా..? కుప్పమా..? అసలు నీకు సొంత ఊరు, ఇల్లు ఉన్నాయా..? మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు ఓటు ఎక్కడేశావ్‌..? ఎన్నికకోదగ్గర ఓటేసే నీ బతుకు.. ఏసారి ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని నీ కొడుకు బతుకు.. అందరికీ తెలుసు’ అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. 
 

Back to Top