స్పీకర్‌గా తమ్మినేని ఎంపిక  శ్రీకాకుళం జిల్లాకు లభించిన గౌరవం

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
 

 

అమరావతి: తమ్మినేని సీతారాం శాసనసభ పతి గా ఎన్నిక కావడం పట్ల శ్రీకాకుళం జిల్లాకు గౌరవం లభించిందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు.రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ పదవి  రావడం సంతోషంగా ఉందన్నారు.ఏకగ్రీవంగా ఎన్నికకావడం మంచి సంప్రదాయంగా పేర్కొన్నారు.అనుభవం గల వ్యక్తిగా,ప్రజా జీవితంలో కూడా అట్టడుగు ప్రజలతో సంబంధాలు కలిగి అన్యాయాన్ని ఎదురించాలనే తపన గలిగే వ్యక్తి  తమ్మినేని అని కొనియాడారు.అసెంబ్లీ ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించిన వ్యక్తి అని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ..సభ నిర్వహణ తీరు,సభ నిర్వహించే వ్యక్తుల మీద ప్రజల  ప్రభావం ఎంత ఉంటుందనేది ఈ∙ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top