అసెంబ్లీ: గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, గిరిజన పక్షపాతిగా సీఎం వైయస్ జగన్ నిలిచారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. ఎస్టీలందరి తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గిరిజనుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల పేరు చెబితే వైయస్‌ఆర్ గుర్తుకువస్తారన్నారు. పోడు వ్యవసాయం చేసుకునే నిరుపేద గిరిజనులకు భూములపై హక్కు కల్పించిన నాయకుడు వైయస్‌ఆర్ అని కొనియాడారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. తండ్రి బాటలో నడుస్తూ.. గిరిజనులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారన్నారు. గాంధీ జయంతి రోజున పాడేరులో మెడికల్ కాలేజీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. విష జ్వరాలతో బాధపడుతున్న పేద గిరిజనులను ఆదుకోవాలని పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. కురుపాంలో ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. నాణ్యమైన విద్య ప్రతి గిరిజనుడికి అందించాలనే ఆలోచనతో యూనివర్సిటీకి సీఎం శ్రీకారం చుడుతున్నారన్నారు. గత పాలకులు ఏ విధంగా విస్మరించారో మనం చూశాం. గిరిజనులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ఎన్నికలకు ఆరు నెలల ముందు మంత్రిని నియమించి ఎస్టీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కానీ, సీఎం వైయస్ జగన్ గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు.