సంక్షేమం.. అభివృద్ధి పాలనకు పట్టం కట్టండి

చుట్టపు చూపు పయ్యావుల కేశవ్ కు బుద్ధి చెప్పండి

ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు కేశవ్

టీడీపీ నేతల మోసపు మాటలు నమ్మవద్దు

రామసాగరం ఎన్నికల ప్రచారంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వై. విశ్వేశ్వరరెడ్డి ,శంకర్ నారాయణ 

ఉరవకొండ: రాష్ట్రంలో సంక్షేమం.. అభివృద్ధి పాలన అందిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య ప్రజలను కోరారు. బెలుగుప్ప మండలం రామసాగరం గ్రామంలో ఇంటింటికి విశ్వన్న కార్యక్రమంలో భాగంగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత బూదిగుమ్మ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. హారతులు పట్టారు. అనంతరం ప్రచార రథం పై వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా గ్రామ కూడలి లో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే గా గెలిచి ఐదేళ్ల పాటు జనాలని గాలికొదిలేసిన పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఎన్నికలనగానే ప్రజల పై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నాడని విమర్శించారు. కరోన సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈయన బయటకు కూడా రాలేదన్నారు. పయ్యావుల కేశవ్ కు ప్రజల క్షేమం పట్టదు,వారి బాగోగులు పట్టవు కేవలం పదవి కాంక్ష తప్ప వేరే ధ్యాస లేదన్నారు. అసలు ప్రజలకు ఏమి చేశావని ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు కేశవ్ అని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్న పయ్యావుల కేశవ్ లాంటి పగటి వేషగాడికి ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అదే విదంగా గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలు గుర్తించాలన్నారు. 

నాడు చంద్రబాబు మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ వంటి అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచాడన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో వైయ‌స్ఆర్ ఆసరా, అమ్మవడి, చేయూత, రైతు భరోసా,వాహన మిత్ర, ప్రభుత్వ బడుల్లో నాడు- నేడు, గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గడప వద్దకే అందించాడన్నారు. మ్యానిఫెస్టోలో హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత వైయ‌స్ జగన్ కే దక్కిందన్నారు. 

గడిచిన నాలుగేళ్ళలో ఒక్క రామసాగరం గ్రామంలో రూ.16 కోట్లు అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించారు.ఒక హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఈ రోజు జీడిపల్లి చుట్టుపక్కల గ్రామలన్ని కొనసీమను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా దివంగత మహానేత వైయ‌స్ఆర్ చలువే అన్నారు. ఇంత మంచి చేసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకే ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాని వారు కోరారు.

కార్యక్రమంలో జెడ్పిటిసి మమత, ఎంపిపి పెద్దన్న, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు మచ్చన్న, మండల ఉపాధ్యక్షులు దేవనాథ్ రెడ్డి, కరుణాకర్ నాయకులు త్రిలోక్ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ శ్రీనివాసులు, బెలుగుప్ప, అవులన్న సహకార సంఘాల అధ్యక్షులు శివలింగప్ప, శ్రీనివాసులు, పార్టీ ప్రచార కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు పాటిల్ నాగిరెడ్డి, వ్యవసాయ సంఘం మండల అధ్యక్షుడు ముత్యాలరెడ్డి, రామసాగరం సర్పంచ్ రామకృష్ణమ్మ, ఎంపీటీసీ వీర బొమ్మన్న, నాయకులు గోవిందురెడ్డి, జయరామ్ రెడ్డి, తిమ్మారెడ్డి, కేశవరెడ్డి, రమేష్, ఉమ్మన్న, దేవి, దొనసింహ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top