ఏపీని చంద్రబాబు ప్రభుత్వం  అప్పుల్లోకి నెట్టింది

ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదు..ఆస్తులు పెంచలేదు 

స్వార్థపూరిత రాజకీయాలతో ఏపీని నాశనం చేశారు

ఏపీ ఆర్థిక పరిస్థితిని వైయస్‌ జగన్‌ గాడిలో పెడతారు

వైయస్‌ఆర్‌సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు: ఆర్థికలోటులో ఉన్న ఏపీని టీడీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవం పేరుతో అందలం ఎక్కిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.ప్రజల విశ్వాసం చూరగొన్న వైయస్‌ జగన్‌ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతారని తెలిపారు.ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.ఒక్కొక్క తలపై లక్షా పదివేల రూపాయలు అప్పుల భారం ఉందన్నారు.పరిపాలనను అస్తవ్యస్తం చేశారన్నారు.స్వార్థ పూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. చంద్రబాబు.. తన కుటుంబం,కుమారుడు,తాబేదారులైన కాంట్రాక్టర్లకు మేలు కలిగే కార్యక్రమాలు చేపట్టారని మండిపడ్డారు.2004 చంద్రబాబు ఓటమి చెంది..వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్ర పరిస్థితి మైనస్‌ బాలెన్స్‌లో సంక్షోభంలో ఉందన్నారు.ఆనాడు వైయస్‌ఆర్‌ ఆర్థిక క్రమశిక్షణ పాటించి కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆర్థిక స్థితిని మెరుగుపర్చారన్నారు.ఈ ఐదేళ్ల పాలన కూడా చంద్రబాబు  రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు.అభివృద్ధి జరగలేదని,ఆస్తులు పెంచలేదని దుయ్యబట్టారు.కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతారని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top