నిమ్మగడ్డా నీ ప్రయాణం ఎర్రగడ్డకా..? మరోచోటుకా..?

కోరికలు తీర్చుకోవడానికి పర్యటనలు చేస్తున్నావా..?

ఎస్‌ఈసీ జిల్లాల పర్యటన చంద్రబాబు ఎజెండాలో భాగమే..

చంద్రబాబు రుణం తీర్చుకోవాలని నిమ్మగడ్డ తాపత్రయం

రమేష్‌కుమార్‌ రాజకీయ వ్యాపారి.. బాబు జేబులో మనిషి..

వైయస్‌ఆర్‌ 2009 మరణిస్తే నిమ్మగడ్డకు 2021లో గుర్తొచ్చాడు

పవన్‌ కల్యాణ్‌ యాచించడం మానేసి.. డైలాగ్‌లు చెబితే బాగు

2014లో చంద్రబాబును, ప్రస్తుతం బీజేపీని యాచిస్తున్న పవన్‌

ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్నప్పుడు పవన్‌ ఎక్క‌డున్నాడు..?‌

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వ‌జం

తాడేపల్లి: ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని, ఎన్నికల కమిషనర్‌గా కర్తవ్య నిర్వహణకు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారా..? లేక కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ఎంతోమంది ఎన్నికల అధికారులు, కమిషనర్‌లను చూశాం కానీ, ఇలాంటి సంకర జాతి (హైబ్రీడ్‌) కమిషనర్‌ను చూడలేదన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పొలిటీషియన్‌ కం కమిషనర్‌ అని విమర్శించారు. చంద్రబాబు అజెండాలోనే భాగంగానే జిల్లా పర్యటనకు వెళ్తూ.. బాబు స్క్రిప్ట్‌ను చదువుతున్నాడన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 
‘అన్ని విధాలుగా నిమ్మగడ్డకు సన్నిహితుడైన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు తన పదవికాలంలో ఉన్న సమయంలో (మార్చి 31) ఎంతకైనా దిగజారి కమిషనర్‌గా వ్యవహరించాలనుకోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్ట పరిణామంగా వైయస్‌ఆర్‌ సీపీ భావిస్తుంది. 

నిమ్మగడ్డ పర్యటన చూస్తుంటే పగ, కక్ష తీర్చుకోవాలనే తాపత్రయం కనిపిస్తుంది. చంద్రబాబును చిత్తుగా ఓడించిన వైయస్‌ఆర్‌ సీపీ, వైయస్‌ జగన్‌పై కక్షగట్టి, ఆ పగను తీర్చుకునేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ కామెంట్లు చేస్తున్నారు. 

ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషనర్స్‌ను చూశాం కానీ, నిమ్మగడ్డ సంకర జాతి కమిషనర్‌ (హైబ్రీడ్‌)గా ఉన్నాడు. అంటే పొలిటీషియన్‌ కం కమిషనర్‌గా వ్యవహరిస్తున్నాడు. నిమ్మగడ్డ మాటలు వింటుంటే నిజంగా నవ్వు వస్తుంది కానీ, కోపం రావడం లేదు. పిచ్చి చేష్టలు, పిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. 

ఒంటిమిట్టలో నిద్రపోవాలనే కోరిక ఉందంట. ఉదయాన్నే లేచి శ్రీరాముడిని దర్శించుకొని అభిషేకం చేయాలనే కోరిక ఇవాళ తీరిందంట. ఎన్నికల కమిషనర్‌గా కోరికలు తీర్చుకోవడానికి పర్యటనలు చేస్తున్నావా..? 

కడపకు వెళ్లి అసందర్భ ప్రేలాపణలు పేలుతున్నాడు. 2009లో మా ప్రియతమ నాయకులు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ మరణిస్తే ఎన్నికల కమిషనర్‌కి 2021లో గుర్తొచ్చాడు. దీన్ని బట్టి వైయస్‌ జగన్‌పై కక్షగట్టి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు జేబులో మనిషిలా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడని ప్రజలు ఛీ కొడుతుంటే దాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడానికి వైయస్‌ఆర్‌ను పొగుడుతున్నాడు. 

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రజాస్వామ్యవాది కానేకాదు.. ఆయన ఏ వాదో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. సీబీఐ కేసులో నేను సాక్షిని, నేను భయపడను, నిజం చెబుతాను అని అసందర్భంగా మాట్లాడడం ఏంటీ..? ఎన్నికల కమిషనర్‌గా కడపకు వెళ్లావా..? లేక పొలిటికల్‌ లీడర్‌గా వెళ్లావా..? 

ఎన్నికల కమిషనర్‌గా ఉండి ఆ మంత్రిని, ఈ సలహాదారును, ఆ ఐఏఎస్‌ అధికారిని తొలగించండి అంటూ లేఖలు రాస్తున్నాడు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..? వైయస్‌ఆర్‌ను పొడుగుతూనే.. ఆయన విగ్రహాలకు ముసుగులు వేస్తున్నాడు. నువ్వు నిబంధనలు తప్పడం లేదా..? నీకో న్యాయం, రాజకీయ పార్టీలకు, నాయకులకు ఒక న్యాయమా.. ఏంటిది..? నిమ్మగడ్డా నువ్వు ఎర్రగడ్డకు వెళ్లాలా..? మరోచోటకు వెళ్లాలా..? ఆలోచించుకోవాలి. 

ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలని ఏ అధికారి అయినా కోరుకుంటారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహారశైలి. మీడియాను పొగుడుతూనే.. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పని నువ్వు ప్రజాస్వామ్యవాదివా..? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

ఖాళీగా ఉండటం ఇష్టం లేదని క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలు పెడతావా..? నీ మాటల వెనకున్న అభిప్రాయాలు ఏంటో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. నువ్వొక రాజకీయ వ్యాపారివి, బాబు జేబులో మనిషివి. మార్చి 31 తరువాత తెలుగుదేశం పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా అయ్యేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అప్రజాస్వామిక విధానం.. దీనికి మూల్యం చెల్లించకతప్పదు. 

పవన్‌ కల్యాణ్‌ నిన్న రాష్ట్రంలోని కాపు పెద్దలతో సమావేశమై.. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లాలని పవన్‌ అన్నాడు. ఇది కేవలం సినిమా డైలాగ్‌గా మిగిలిపోతే ఎలా..? ముందు పవన్‌ యాచించడం మానాలి. మొదట తెలుగుదేశాన్ని..  ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. కాస్త మీ కాళ్ల మీరు నిలబడే పరిస్థితికి వస్తే.. అప్పుడు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్తారు.. పవన్‌ కల్యాణ్‌ మీరే యాచించే స్థాయిలో ఉన్నారు. 

తిరుపతి సీట్‌ ఇవ్వండి.. జీహెచ్‌ఎంసీ సీట్లలో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. జీహెచ్‌ఎంసీలో సీట్లు ఇవ్వలేదు.. తిరుపతి సీటు అడిగితే పవన్‌కు బీజేపీ పుచ్చిపోయిన లడ్డూ ఇస్తుందేమో.. 2014లో చంద్రబాబును యాచించి సీఎంను చేశారు.. ఏం చేశాడు చంద్రబాబు చివరకు.. 

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం జరిపినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు..? గత చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్న రోజుల్లో చిరంజీవి, దాసరి నారాయణరావు బయటకు వచ్చి హోటల్‌ హయత్‌లో గర్జించి.. ముద్రగడకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరికలు పంపారు. అప్పుడు పవన్‌ ఎక్కడున్నారు. ముందు పవన్‌ యాచించే స్థాయి నుంచి సొంత కాళ్ల మీద నిలబడే స్థాయికి వెళ్లండి’ అని అంబటి రాంబాబు సూచించారు. 
 

Back to Top