శాసన రాజధాని అనే మాటకు నిండైన అర్థం తెచ్చారు 

రాజధాని ప్రాంత పేదలంతా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రుణపడి ఉంటారు

చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారు

ఇళ్ల పట్టాలతో అమరావతిలో పేదల కలను నిజం చేస్తున్నాం

వచ్చే సంక్రాంతి పండుగను నూతన గృహాల్లో జరుపుకునేలా చూడాలి

ఇళ్లను శరవేగంగా నిర్మించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కోరుతున్నా

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

అమరావతి: రాజధాని ప్రాంతంలోని నిరుపేదలంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దశాబ్దాలుగా సొంత ఇళ్లు లేని నిరుపేదలు రెండేళ్ల నిరీక్షణ తరువాత సుమారు 52 వేల మంది సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నారన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం వైయస్‌ జగన్‌ సంకల్ప బలంతో రాజధాని ప్రాంత నిరుపేదలు నేడు ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నారన్నారు. రాజధానిలోని వెంకటపాలెంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని మాట్లాడారు. 

‘‘రెండేళ్ల క్రితం ఇళ్లు లేని నిరుపేదలు సుమారు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ముఖ్యమంత్రి ఇచ్చారు. అందులో సుమారు 23 లక్షల మంది ఇళ్లను శరవేగంగా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే చాలావరకు పూర్తయి అక్కచెల్లెమ్మల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దబ్దాలుగా తమకు సొంత ఇళ్లు లేదని బాధపడే పేదలు రెండేళ్లుగా ఎదురుచూసి కళ్లు కాయలు కాసిన పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో అందరికీ ఇళ్ల పట్టాలు అందబోతున్నాయి. రాజధాని ప్రాంతంలోని పేదలంతా సీఎంకు రుణపడి ఉంటారు. 

చంద్రబాబునాయుడు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇదే సీఆర్‌డీఏ చట్టంలో 5 శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇవ్వాలని పేదల మీద ప్రేమతో పెట్టలేదు.. తప్పనిసరి కాబట్టి 5 శాతాన్ని రిజర్వ్‌ చేశారు. కానీ, ఐదేళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు మనసులో మాట బయటపెట్టాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు రాజధాని ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇళ్లు ఎందుకు కట్టించాలి.. నేను, నా బినామీలు కొనుగోలు చేసిన భూముల విలువ పడిపోద్ది.. పేదలు, దళితులు ఉంటే ఇది రాజధాని కాదని సమాధులతో సైతం పోలిక పోల్చాడంటే మతిభ్రమించి మాట్లాడుతున్నాడని రాష్ట్రం గ్రహించింది. 

ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తే.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పటికే 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షలపైగా నివాసం ఉంటున్నారంటే.. మా రాజధాని వాసుల కోరిక కూడా ఇవాళ తీరబోతుంది. 52 వేల మంది పేదలు రాబోయే సంక్రాంతి పండుగను ఆ ఇళ్లలో జరుపుకునేలా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి మా కోరికను మన్నించి తగిన రీతిగా అధికారులకు ఆదేశాలిచ్చి మీ చేతుల మీదుగానే పేదలు సంతోషంగా సంక్రాంతి జరుపుకునేలా పరిస్థితి తీసుకురావాలి. 

ఒకనాడు రాజధాని ప్రాంతంలో ఎవరైనా అద్దెకు రావాలన్నా.. నీకులం ఏంటీ అని అడిగే పరిస్థితులు చూశాం. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అండదండలతో నా కులం మానవత్వం, నా మతం సమానత్వం అనే పరిస్థితి వచ్చింది. 

చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలు పన్ని, రైతుల ముసుగుతో, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కోర్టుల్లో కేసులు వేసినా కూడా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా న్యాయానికి, ధర్మానికి, పేదవాడికి అండగా న్యాయస్థానాలు నిలబడినప్పటికీ ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తిస్తోంది. ఏబీఎన్‌లో ఆర్‌–5 జోన్‌ ఆరిపోయే జోన్‌ అని ప్రజల చేత మెంటల్‌ కృష్ణ అని పిలిపించుకోబడుతున్న వెంకటకృష్ణ మాట్లాడుతున్నాడు. కచ్చితంగా సంక్రాంతి పండుగ నాటికి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్లను నిర్మించాలని కోరుతున్నాను. శాసన రాజధాని అనే మాటకు నిండైన అర్థం తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి పాదాభివందనం చేస్తున్నాం’’ అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top