తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత ప్రతిపక్షంపై వేధింపులే లక్ష్యంగా పని చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని అరెస్టు చేయడం, కూటమి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వరదాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్ట్›్జ ఖనిజాన్ని తవ్వి తరలించాలని తొలుత ఆరోపించి, కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు, ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఏ–1 గా ఉన్న శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో, ఎలాగైనా మాజీ మంత్రి కాకాణికి బెయిల్ రాకుండా చేసి, జైలుకు పంపాలన్న కుట్రతో.. ఆయన క్వార్ట్›్జతవ్వకాలు జరిపినప్పుడు ఎస్టీల (గిరిజనుల)ను బెదిరించారంటూ, మైనింగ్ అధికారితో ఫిర్యాదు చేయించారు. దానిపై పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదు చేసి, తొలి కేసులో ఇంప్లీడ్ చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్థన్‌రెడ్డిని ఏ–4 గా చూపారు. అలా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ముందస్తు బెయిల్ రాకుండా కుట్ర చేశారు. ఆ తర్వాత ఈరోజు ఆయనను అరెస్టు చేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, టార్గెట్‌గా పెట్టుకున్న వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు.. ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్టుల ఎవ్వరినీ వదలడం లేదు. తాము ఏది చేసినా ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న కుట్ర, కుతంత్రం, దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. అందుకు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇది అత్యంత హేయం. మాచర్లలో కూడా టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య జరిగితే, ఆ హత్య చేసింది టీడీపీ వారేనని చెప్పిన పోలీసులు అన్యాయంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, ఆయన సోదరుడిపై కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ తీరును, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వ దమననీతిని గట్టిగా ఎదుర్కొంటామని ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.