కాకినాడ: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు శుక్రవారం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భారత్ కు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐతో నిష్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరిపించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ పరిధిలో జరిగిన డీఎస్సీ నియామక అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు నెలకు ఒక్కొక్కరికి రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని పక్కనపెట్టకుండా నిరుద్యోగ యువతకు వెంటనే భృతి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తోట నరసింహం , మాజీ ఎంపీ వంగా గీత , పెద్దాపురం వైయస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు , జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు , నగర పార్టీ అధ్యక్షుడు సుంకర శివప్రసన్న , మాజీ కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్ రాజిరెడ్డి దీప్తి తదితరులు పాల్గొన్నారు.