రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను క‌లిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

విజ‌య‌వాడ‌:  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని  వైయ‌స్ఆర్‌సీపీ క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలలో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వైయ‌స్ఆర్‌సీపీనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలతో అధికార టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, పలువురు సీనియర్‌ నాయకులు

ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ఏమన్నారంటే...

అంబటి రాంబాబు, మాజీ మంత్రి

మా వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం ఈ రోజు ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశాం, రేపు తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది, మా పార్టీ తరుపున శేఖర్‌ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిని ప్రకటిస్తే అతని ఆస్తులను ధ్వంసం చేశారు

ఏ విధమైన నోటీస్‌ లేకుండా దుర్మార్గంగా అతని భవనాలు కూల్చేసి భయభ్రాంతులకు గురిచేశారు, అతను పోటీచేయడానికి వీల్లేదని బెదిరించారు

తిరుపతి మేయర్‌ శిరీష వెళితే ఆమెను అడ్డుకున్నారు, చంద్రబాబు బహిరంగంగా రాజీనామాలు చేసి వస్తేనే మా పార్టీలో చేర్చుకుంటామని అనేక సందర్భాలలో చెప్పారు

కార్పొరేటర్ల విషయంలో అది వర్తించదా, మా పార్టీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి లాక్కోవడం దుర్మార్గం

మేం విప్‌ కూడా జారీ చేశాం, అది ఉల్లంఘిస్తే డిస్‌క్వాలిఫై అవుతారు, నిజాయితీ గా పనిచేసే అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌గారిని కోరాం

ఈ రోజు ఉదయం ముద్రగడ పద్మనాభంగారి ఇంటిపై దాడిచేసి అరాచకం సృష్టించారు, తీరా అతను నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు

నేను పిఠాపురం ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి, అయ్యా ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు, మీరు తక్షణమే దీనిపై స్పందించాలి

మీకు ముద్రగడ పద్మనాభం గారు అంటే గిట్టకపోవచ్చు కానీ ఇది ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో మీరు దౌర్జన్యాలను ప్రోత్సహించినవారు అవుతారు

దీనిని అందరూ ఖండించాలి, కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని నూతన డీజీపీని కోరుతున్నా

వెలంపల్లి శ్రీనివాస్‌, మాజీ మంత్రి

ఏపీలో పలుచోట్ల స్ధానిక సంస్ధల ఎన్నికలకు సంబంధించి వివిధ కారణాల వల్ల రాజీనామాలు చేసిన వారు, మరికొన్ని ఖాళీల వల్ల ఎన్నికలు జరుగుతున్న చోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, అధికార పార్టీ నేతలు మా అభ్యర్ధులను బెదిరించడం, ప్రలోభపెట్టడం, లొంగనివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు

నిన్న తిరుపతి డిప్యూటీ మేయర్‌ అభ్యర్ధి ఇంటిని కూల్చడం అందరికీ తెలిసిందే, మేం ఎన్నికల కమిషనర్‌ గారిని కలిసి పారదర్శకంగా ఎన్నికలు జరపాలని, ప్రతి అభ్యర్ధికి భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశాం

చంద్రబాబు గారు మీ సిద్దాంతాలు ఏమయ్యాయి, దొడ్డిదారిన పదవులు పొందాలన్న తాపత్రయం ఎందుకు, అవన్నీ మా వైఎస్సార్‌సీపీవే కదా, మీకు ఇంకా అధికార దాహం తీరలేదు

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, స్ధానిక సంస్ధల్లో మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, మీకు బలం లేని చోట ఎందుకు పోటీకి దిగుతున్నారు

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం అందజేశాం

లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ

ఈ రోజు ఎన్నికల కమిషనర్‌ గారిని కలిసి మొత్తం 10 చోట్ల రేపు జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను వివరించాం

ఈ 10 చోట్లా వైఎస్సార్‌సీపీ గెలిచే స్ధానాలే, అవి మా పార్టీ అభ్యర్ధులు గెలిచినవే, సంఖ్యాపరంగా టీడీపీ గెలిచే అవకాశమే లేదు, చంద్రబాబుకు మీకు అన్నీ తెలుసు కదా

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, బుల్డోజర్‌ సంస్కృతిని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది, మీ పార్టీని వ్యతిరేకిస్తే బుల్డోజర్‌ ప్రయోగిస్తారా

చంద్రబాబు ఇదేనా మీ రాజకీయ సీనియారిటీ, ఎందుకిలా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు

ప్రతి కార్పొరేటర్‌కు, కౌన్సిలర్‌కు భద్రత కల్పించాలి, ప్రత్యేక అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కోరాం

మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి టీడీపీ ప్రలోభాలు వివరించాం, స్ధానిక సంస్ధల్లో  బలం లేకపోయినా టీడీపీ, కూటమి పార్టీలు దౌర్జన్యాలు చేస్తున్నాయి, తెలంగాణలో ప్రారంభమైన మీ ప్రలోభాలు ఈ రోజుకూ కొనసాగిస్తున్నారు. 

ఇంత దారుణంగా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించడం ఎక్కడా చూడలేదు, మీ అరాచకాలన్నీ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్ళాం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరుపున విప్‌ జారీ చేశాం, ఎవరు విప్‌ ఉల్లంఘించినా వారిపై వేటు వేయాలని ముందుగా కోరాం

పోలీస్‌ వ్యవస్ధ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది, మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వెంటనే భధ్రత కల్పించాలి

ఏపీకి బడ్జెట్‌లో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు, అధికార దుర్వినియోగం వెంటనే ఆపాలి లేదంటే రాబోయే రోజుల్లో గవర్నర్‌ గారిని కూడా కలుస్తాం

దేవినేని అవినాష్‌, విజయవాడ ఈస్ట్‌ వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ కౌన్సిలర్లను బెదిరిస్తుంది, జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు

ఈ దాడులు, దౌర్జన్యాలన్నీ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్ళాం

ఈ ఎన్నికలకు నిజాయితీ గల ప్రత్యేక అధికారిని నియమించాలని కోరాం

రాబోయే రోజుల్లో తిరిగి వైయస్‌ జగన్‌ గారు సీఎం అవడం ఖాయం

రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర మేయర్‌

మా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు చేసి బలవంతంగా లాక్కునే ప్రయత్నించడం దారుణం

స్ధానిక సంస్ధల్లో వైయ‌స్ఆర్‌సీపీదే మెజారిటీ అనే భయంతో కూటమి పార్టీలు దాడులకు దిగుతున్నాయి

ఎన్నికలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరాం, ఏ గుర్తుపై గెలిచామో అదే గుర్తుపై మాకు పదవీకాలం ఉన్నంతవరకు పనిచేస్తాం

Back to Top