కుల రాజకీయాలు రెచ్చగొడుతున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలి

గుంటూరు: కుల రాజకీయాలు చేస్తూ రెచ్చగొడుతున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కోరారు. గురువారం గుంటూరు రూరల్‌ ఎస్పీని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. కుల రాజకీయాలు రెచ్చగొడుతున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు మాపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఓట్లు తొలగించి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసిన వారిలో డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, శ్రీకృష్ణదేవరాయులు, బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు.
 

Back to Top