సీఎంను క‌లిసిన కొండెపి, కనిగిరి, కందుకూరు YSRCP నేత‌లు

ప్ర‌కాశం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయ‌స్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నేత‌లు క‌లిశారు. జువ్విగుంట నైట్‌ స్టే పాయింట్‌ వద్ద పార్టీ అధ్య‌క్షులు వైయస్ జగన్‌ను కలిసి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళిని వివ‌రించారు. త‌న‌ను క‌లిసిన పార్టీ నేతలు, కార్యకర్తలను, అభిమానుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థులు అత్య‌ధిక మెజార్టీతో గెలిచేలా ప‌నిచేయాల‌ని పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. 

Back to Top