ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ అక్రమమన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయా ప్రాంతాల్లో పార్టీ నేత‌లు మీడియాతో మాట్లాడారు.  

రాజంపేటలో వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మీడియా సమావేశం...

  • రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించిన ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి...
  • కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం హాస్యాస్పదంగా ఉంది...
  • రాష్ట్ర ప్రభుత్వం ఇలానే చేస్తూ పోతే రాబోవు రోజుల్లో వాళ్లు కూడా ఇప్పటి నుంచే జైలు సిద్ధం చేసుకోవాలని హెచ్చరించిన ఆకేపాటి...
  • ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారు...
  • చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చక ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు...
  • ప్రభుత్వ వేదింపులు తాళలేక ఐపీఎస్ అధికారి సిద్దార్థ కౌశిల్ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం...
  • ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కు  ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేశారని ప్రశ్నించిన ఆకేపాటి...
  • మిథున్ రెడ్డికి ఒక ఎంపీ మాత్రమే ప్రభుత్వానికి అతనికి ఏమి సంబంధం, తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం...

మాజీ డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ  పిఏసి సభ్యులు ఎస్.బి.అంజాద్ బాష...

  • రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతుంది, రాక్షస పాలన కొనసాగుతుంది
  • వైయ‌స్ఆర్‌సీపీ నాయకులే టార్గెట్...
  • పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు
  • పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైయ‌స్ఆర్‌సీపీ ని ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు....లేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు.
  • ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు
  • ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము.
  • ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం - అంజాద్ భాష
  • అధికారం శాశ్వతం కాదు–అధికారులు శాశ్వతం...వచ్చేది వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే...
  • మీరు ఒక దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించారు
  • రాబోయే ప్రభుత్వాలు లో కూడా ఈ దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితి వస్తుందని అన్నారు.
  • కూటమి ప్రభుత్వం లో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.
  • రాబోయే కాలంలో అంతకు అంత వడ్డీతో సహా చెల్లిస్తాం... 
  • పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని 
  •  

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కామెంట్స్‌

  • రాష్ట్రంలో  చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు
  • ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం 
  • లిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదు
  • లిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.
  • వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు పై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు ..
  •  

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుకా కామెంట్స్...

  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. 
  • ఆధారాలు లేని కేసును నమోదు చేసి ఎంపీని అరెస్టు చేయడం చాలా దారుణం. 
  • ఎటువంటి ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు.
  • కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 
  • మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పై ఎమ్మిగనూరు టిడిపి ఎమ్మెల్యే విమర్శలు చేయడం సరికాదు. 
  • ఏకవచనంతో సంభాషించడం మంచి పద్ధతి కాదు. 
  • వైయస్ జ‌గ‌న్‌ హయాంలో ఎమ్మిగనూరు నియోజవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. 
  • తాగునీటి కోసం 143 కోట్లను వెచ్చించాం, ప్రతి ఇంటికి నీటిని తీసుకొచ్చాం. 
  • కరోనా సమయంలో కూడా వైయ‌స్ జగన్ సుపరిపాలన అందించారు. 
  • దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక లోటుపాటితో కొట్టుమిట్టాడుతుంటే ఏపీలో మాత్రం ఇంటికే సంక్షేమ పథకాలు అందించాం.

విజయనంద రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇంచార్జి కామెంట్స్..

  • ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం
  • కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ చేసింది
  • మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కు వెన్నుదన్నుగా ఉండే ఎంపీ మిథున్ రెడ్డి ను అరెస్ట్ చేసి కక్ష్య సాధిస్తున్నారు
  • ఇచ్చిన హమీలు అమలు చేయడం చేతకాదు, ప్రజలను మోసం చేసిన మీకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

మదనపల్లి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి 

  • ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం
  •  
  • రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు చేస్తోంది
  •  మద్యం కేసులో ఎలాంటి సంబంధాలు లేకున్నా ఎంపీ  అక్రమ అరెస్టు చేశారు 
  •  రాష్ట్రంలో సుపరి పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం  వైఎస్ఆర్సిపి నాయకులను టార్గెట్గా చేసుకుని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
  •  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో  కాలం వెలదీస్తుందన్నారు. 
  •  ఎంపీ మిథున్ రెడ్డిని  విడుదల చేయాలని  లేనిపక్షంలో వైసిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
  • ఎంపీ మిథున్ రెడ్డిని  నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేయడం హాస్యాస్పధం గా ఉన్నది
  •  కూటమి ప్రభుత్వం ప్రజలకు  ఇచ్చిన హామీలు నెరవేర్చాలే తప్ప  వైయస్ఆర్ సీపీ నాయకులు టార్గెట్గా చేసుకుని  అక్రమ అరెస్టులు అన్యాయం

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కామెంట్స్‌

  • ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది..
  • ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాబు,కుట్రలకు తెరలేపుతున్నారు.
  • మిథున్‌ రెడ్డి గారి అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.
  • రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు
  • లేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు,
  • ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం..
  •    
     
Back to Top