చంద్రబాబు, రాధాకృష్ణ జైలుకు వెళ్లడం ఖాయం

దోచుకున్న సొమ్ములో ప్రతి పైసా కక్కిస్తాం

ఆంధ్రజ్యోతి కులజ్యోతి పత్రిక

సమాజానికి పట్టిన చీడపురుగు రాధాకృష్ణ

ఏపీ ప్రభుత్వం నుంచి ఆంధ్రజ్యోతికి మొత్తం రూ. 3 వేల కోట్లు

గతంలో మంద కృష్ణమాదిగను బాడగ నేతగా అభివర్ణించాడు

నాపై దుష్ప్రచారం చేస్తున్న ఏబీఎన్‌పై పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేస్తాం

దరిద్రమైన చానల్, పత్రికను మూసివేయాలని కోరుతాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: ఐదేళ్లుగా చేసిన దోపిడీలకు చంద్రబాబుతో పాటు ఆయనకు సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళ్తారని, దానిలో ఎలంటి సందేహం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తనకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రజలను కించపరిచినట్లుగా విషప్రచారం చేస్తుందని, దీనిపై ఈసీకి, సీఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమాజానికి పట్టిన చీడ పురుగు రాధాకృష్ణ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

చంద్రబాబు ఈ రోజు 38 పేజీ మేనిఫెస్టో విడుదల చేశారు. గతంలో ఒక పుస్తకాన్ని రిలీజ్‌ చేశారు. 650 పైచిలుకు హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సిగ్గులేకుండా ప్రజల వద్దకు వస్తున్నాడు.

ప్రజలంతా చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబు మాట్లాడుతూ.. మీరంతా నాకు అండగా నిలబడాలి. లేకుంటే జైలుకు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. 

చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు.. గత ఐదు సంవత్సరాలుగా దోచుకునే దానికి ఎవరెవరు సహకరించారో.. అందులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక భాగస్వామి. రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు పోతారనే దానిలో ఏ మాత్రం సందేహం లేదు. 

అధికారం చివరి రోజుల్లో ఉంది. అధికారం చేజారుతుందని చంద్రబాబు అసహనానికి లోనవుతున్నాడు.

విశాఖలో ఒక ఆరోపణ చేశారు. గర్భిణీ స్తీ్ర మీద వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు అత్యాచారం చేశారని, దాన్ని పోలీసులు వెంటనే ఖండించారు. ఆ ఘటనతో వైయస్‌ఆర్‌ సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఈ రోజుకూ అవినీతి చక్రవర్తి పదే పదే మీటింగ్‌లలో చెబుతున్నాడు. 

చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారని లోక్‌నీతి, సీఎస్‌డీఎస్‌ సర్వే చెప్పినట్లుగా 130 స్థానాలు గెలుచుకోబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం రాశారు. దాన్ని తిప్పి కొడుతూ మాకు ఆ సర్వేకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ స్పష్టంగా తెలియజేశారు. చంద్రబాబు, రాధాకృష్ణ ముఖం మీద ఉమ్మేసినట్లేనని చాలా స్పష్టంగా తెలుస్తుంది. 

రాధాకృష్ణ విషయానికి వస్తే నాలుగున్నర సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఇంచుమించుగా ఏబీఎన్‌ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికకు రూ. 15 వందల కోట్ల ప్రకటనలు, మిగతా రూపంలో రిసిట్స్‌ వచ్చాయి. ఇది కాకుండా అధికారం అడ్డుపెట్టుకొని మరో రూ. 15 వందల కోట్లకు సెటిల్‌మెంట్‌ చేసిన దళారి రాధాకృష్ణ. 

చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళ్తాడు. దాంట్లో సందేహం లేదు. 

ఏబీఎన్‌లో నాపై దుష్ప్రచారం చేశారు. మా పార్టీ అధ్యక్షులను, ఆంధ్రరాష్ట్ర ప్రజలను కించపరిచి మాట్లాడుతున్నట్లుగా దుష్ప్రచారం ఆంధ్రజ్యోతి చానల్‌లోనే వచ్చింది. «

ఆంధ్రజ్యోతి కుల జ్యోతి మాత్రమే. ఒక కులానికి కొమ్ముకాస్తున్న పత్రిక మాత్రమేనని స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతంలో కిరోసిన్, రేషన్‌ బియ్యంlదొంగ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకు ఇంతకు మించిన ఆలోచనలు వస్తాయా.. 

ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలకు చాలా మంది స్పందించారు. మానవతా విలువలు విడిచి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ అసభ్యకరంగా మాట్లాడకూడదని అనుకుంటుందో.. అలాంటి పదజాలంతో దూషిస్తున్నారు. ఇది వారి విజ్ఞతకే వదలడమే కాకుండా చట్టపరంగా దీనిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాం. 

రాధాకృష్ణ నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే.. నీ చానల్‌లో ప్రసారం చేసిన న్యూస్‌ ప్రూవ్‌ చేయి. మీ అందరికీ నా వాయిస్‌ తెలుసు. నా వాయిస్‌ కాదని ప్రజలందరికీ తెలుసు. కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రసారం చేశాడు. టీడీపీ ప్రయోజనాల కోసమే ఈ న్యూస్‌ ప్రసారం చేశారు. 

నిన్న లక్ష్మీపార్వతిపై, నేడు నాపై దుష్ప్రచారం చేశారు. రేపు ఇంకొక వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై చేస్తారని స్పష్టంగా అర్థం అవుతుంది. 

నువ్వు జాతీయ నాయకుడివా.. లేక దేశ భక్తుడివా.. నువ్వు సమాజానికి చీడ పురుగువి, ఒక కులానికి నాయకుడివి.. కుల పిచ్చి ఉన్న వ్యక్తివే కానీ.. నాయకుడివే కాదు.. సమాజానికి ఉపయోగపడే వ్యక్తివి కాదని స్పష్టంగా చెబుతున్నా. 

గతంలో రాధాకృష్ణ మంద కృష్ణమాదిగను బాడుగ నేతగా అభివర్ణించాడు. రాధాకృష్ణ ఎవరో కాదు.. నువ్వు కాదా బాడుగ నేత అని ప్రశ్నిస్తున్నా.. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తామని స్పష్టంగా చెబుతున్నా.. 

ఈ విషయంపై రాష్ట్రంలోని ఎలక్షన్‌ కమిషన్‌ ఈఓకు, ఢిల్లీలోని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇన్‌ఫర్‌ మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ మినిస్ట్రీలో ఇంత దరిద్రమైన చానల్‌ ఉండదు. ఇంత దుష్ప్రచారం చేసే చానల్‌ ఉండదు. జర్నలిస్టు విలువలను తుంగలో తొక్కుతున్న పత్రిక, చానల్‌ను మూసివేయాలని ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ దుష్ప్రచారం చేసే న్యూస్‌ ఉద్భవించింది కాబట్టి ఇక్కడి పోలీసులకు కూడా రాధాకృష్ణ మీద ఫిర్యాదు చేస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. 

 

Back to Top