మైలవరంలో అలజడికి దేవినేని ఉమానే కారణం

రాజకీయ లబ్ధికోసమే తప్పుడు వ్యాఖ్యలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు..

వైయస్‌ఆర్‌సీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌

 

మైలవరంలో జరిగిన అలజడికి దేవినేని ఉమానే కారణమని వైయస్‌ఆర్‌సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసం దేవినేని ఉమ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.జరిగిన సంఘటను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఉమ వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు.శాంతిభదత్రలకు విఘాతం కలిగించడానికి వైయస్‌ఆర్‌సీపీ చేసిందనే తప్పుడు వ్యాఖ్యలను ఖండించారు.వాస్తవంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నేతపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యయత్నం జరిగింది.ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ సొంత బాబాయ్‌పైనే హత్య జరిగింది..ఆపగలిగారా..అని ప్రశ్నించారు. పోలీసులు,వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా ఎక్కడా ఫిర్యాదులు కూడా చేసుకోలేదన్నారు.సల్వ సంఘటన తప్పితే ఏవిధమైన నష్టం జరగలేదు.ఓటమి భయంతోనే దేవినేని ఉమా అల్లర్లు సృష్టిస్తున్నారని తెలిపారు.దేవినేని అనుచరులే కావాలని గొడవ సృష్టించారన్నారు.

Back to Top