వైయస్‌ జగన్‌తోనే బీసీలకు మేలు..

కల్యాణదుర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఉషా

ఏలూరు:బీసీలంతా మహాశక్తిగా ఎదగాలనే లక్ష్యంతో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారని కల్యాణదుర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఉషా అన్నారు. ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జనలో ఆమె ప్రసంగించారు.వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రతి కులాన్ని వైయస్‌ జగన్‌ కలుసుకున్నారని తెలిపారు. నవరత్నాలు ద్వారా అనేక పథకాలు ప్రకటించారని తెలిపారు.బీసీ డిక్లరేషన్‌ ద్వారా బీసీలందరికి మేలు జరుగుతుందన్నారు. బీసీలకు రాజ్యాంగ,రాజకీయ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు.

Back to Top