మైనారిటీలంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే

వైయ‌స్ఆర్‌సీపీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ  ఇన్‌చార్జ్ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

50 ముస్లిం మైనారిటీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

క‌ర్నూలు:  మైనారిటీలంతా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంటే ఉన్నార‌ని, ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి చేసుకోవాల‌ని ఎదురుచూస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పేర్కొన్నారు. ఆత్మ‌కూరు మండ‌లం వ‌డ్ల రామాపురం గ్రామానికి చెందిన 50 ముస్లిం మైనారిటీ కుటుంబాలు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ఈ సంద‌ర్భంగా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ..  నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో చంద్ర‌బాబు ఏ ఒక్క వ్యవస్థనూ చట్టప్రకారం నడవనివ్వలేదని మండిపడ్డారు.

కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు రాష్ట్రాన్ని దోచుకుతినేలానే ప్రభుత్వ పథకాలు రూపొందిస్తున్నారని విమ‌ర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న చోట్ల  పోలీస్, రెవెన్యూ వ్యవస్థల వత్తాసుతో సర్వేల పేరిట ఇంటింటికీ తిరిగి, ఆధార్‌ కార్డులు, ఫోన్‌ నంబర్లు తీసుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేసేందుకు కుట్ర సాగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ కుట్ర‌ల‌ను అడ్డుకుందామ‌ని, వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు. 

Back to Top