చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

చంద్రబాబు,జేబు మీడియాను ప్రజలు నమ్మరు

వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్‌

 

విజయవాడ: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థి నందిగం సురేష్‌ అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్ని కుయుక్తులు,కుట్రలు పన్నినా చంద్రబాబు,జేబు మీడియాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.వైయస్‌ జగనమోహన్‌రెడ్డి ఎప్పడు మేనిఫెస్టో విడుదల చేస్తారో చూసి చూసి నిన్న సాయంత్రం టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారన్నారు.రాష్ట్ర సంపదను చంద్రబాబు దోచుకున్నారన్నారు.పోలవరం,రాజధాని,పట్టిసీమ కుంభకోణంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.రైతులు,ప్రజల నుంచి 50 వేల ఎకరాలు తీసుకుని వందల ఎకరాల్లో కూడా ఏ భవనాన్ని చంద్రబాబు కట్టలేదన్నారు.ప్యాకేజీ తీసుకునే చంద్రబాబును శివాజీ పొగుడుతున్నారన్నారు.

Back to Top