చంద్రబాబుది ఊసరవెళ్లి క్యారెక్టర్‌

వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోహన్‌బాబు

తెలుగు దేశం..ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ

పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు

వైయస్‌ జగన్‌ మాట మీద నిలబడే వ్యక్తి

 

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని సినీ నటుడు, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. చంద్రబాబుది ఊసరవెళ్లి క్యారెక్టర్‌ అని అభివర్ణించారు. 
చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు. అసత్యాలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. టీడీపీ ఎవరిది..ఎన్‌టీ రామారావుది. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచన వ్యక్తి చంద్రబాబు. నేను ఏ పదవి ఆశించి వైయస్‌ఆర్‌సీపీలో చేరలేదన్నారు. రాత్రికి రాత్రే చంద్రబాబు ఎమ్మెల్యేలను తన శిబిరంలో చేర్చుకుంటే..వారిని పిలిచేందుకు వైశ్రాయ్‌ హోటల్‌ వద్దకు వెళ్లి పిలిస్తే..చంద్రబాబు చెప్పులు వేయించారని, ఇది వాస్తవమని భగవంతుడి సాక్షిగా చెప్పారు.

అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతోనే అలవాటైందన్నారు.హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లను వాడుకున్నారన్నారు.  ఇటువంటి నీచుడు, దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరు ఉండరని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్‌ ఓ క్యాసెట్‌ విడుదల చేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాట చెబితే అది వేదమన్నారు. కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, పేదలకు పక్కా ఇల్లు నిర్మించిన మహానేత వైయస్‌ఆర్‌ అన్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా కల్పించిన గొప్ప వ్యక్తి వైయస్‌ఆర్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎందుకు చంద్రబాబును నమ్మాలని ఆయన ప్రశ్నించారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఎవరికి భరోసా కల్పించారని నిలదీశారు. వైయస్‌ఆర్‌ ఆశయాలతో పుట్టిన వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే అందరికీ మంచి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మాట మీద నిలబడే వ్యక్తి అని..ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.
 

Back to Top