వైయస్‌ జగన్‌ను ఎదిరించే నాయకులు లేరు

మరో 15 ఏళ్లు జననేతే ముఖ్యమంత్రి

వైయస్‌ఆర్‌ సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి

 

హైదరాబాద్‌: చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌ సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మరో 15 సంవత్సరాల వరకు వైయస్‌ జగనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. టీడీపీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని, చంద్రబాబు ఓటమితోనే ఎన్టీఆర్‌ ఆత్మశాంతిస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు.

Back to Top