బాబువన్నీ దిగజారుడు రాజకీయాలే..

ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవను పార్టీకి ఆపాదిస్తారా..?

పెద్దగంట్యాడ ఘటనను తీవ్రంగా ఖండించిన వైయస్‌ఆర్‌ సీపీ నేత కొండా రాజీవ్‌

విశాఖపట్నం: ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను ఎల్లోమీడియా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ నేత కొండా రాజీవ్‌ ధ్వజమెత్తారు. మహిళలపై దాడులను వైయస్‌ఆర్‌ సీపీ ఎప్పుడూ ప్రోత్సహించదని, అలాంటి సంఘటనలు జరుగకుండా చూసేందుకు ముందు వరుసలో ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో కొండా రాజీవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పెద్దగంట్యాడ ప్రాంతంలో నెమలిపూడి సిద్ధూ, ఆయన భార్య నాగమణి దంపతులకు వారు అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్‌కు మధ్య గొడవ జరిగితే దాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో పార్టీపై బురదజల్లుతూ.. పబ్బం గడుపుకోవాలని విషప్రచారంచ చేసిందన్నారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెద్దగంట్యాడలోని పిట్టోనివారి వీధిలో పిట్ట నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో సిద్ధూ నివాసం ఉంటున్నాడని, గత కొన్ని నెలలుగా ఉపాధి లేక ఇంటి అద్దె కట్టడం లేదని, దీనిపై ఇంటి ఓనర్‌కు, సిద్ధూ దంపతులకు మధ్య గొడవ జరిగిందన్నారు. దీనిపై సిద్ధూదంపతులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారన్నారు. ఇద్దరు వ్యక్తులపై జరిగిన సంఘటనను పార్టీకి రుద్దడం చాలా తప్పన్నారు. ఎవరు చెప్పారని ఎల్లో మీడియా వైయస్‌ఆర్‌ సీపీపై తప్పుడు వార్తలు రాసిందని ప్రశ్నించారు. 

విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం జె్రరిపోతులపాలెం గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే కనీసం స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రోజు ప్రెస్‌ ముందుకు వచ్చి వైయస్‌ఆర్‌ సీపీపై నిందలు వేస్తున్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. 

Back to Top