మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ విడుదల 

 నెల్లూరు జిల్లా:   వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్‌ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్‌ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ లభించినట్లయ్యింది. 

బెయిల్‌పై ప్రాసిక్యూషన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా.. కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాణి జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా.. ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు.  ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్‌లు వేశారు. నెల్లూ జిల్లా ప్రజలే నా ఆస్తి’’ అని కాకాణి పేర్కొన్నారు. 

Back to Top