బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి 

బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లండి 

 వైయస్ఆర్‌సీపీ విశాఖ‌ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయిలో బ‌లోపేతం చేయాల‌ని విశాఖ‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శుక్ర‌వారం విశాఖ జిల్లా  వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కేకే రాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మంపై పార్టీ నేత‌ల‌కు కేకే రాజు  దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ..`నియోజకవర్గంలో ఉన్న వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు సమన్వయంతో  కలిసి త్వరితగతిన వార్డు స్థాయి కమిటి నిర్మాణం పూర్తి చేయాలి.  ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజలు తరుపున పోరాటం చేసినపుడే నిజమైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు. 2024 ఎన్నికల ముందు టీడీపీ, బిజెపి, జనసేన ఒక కూటమిగా ఏర్పడి అనేక మోసపూరిత హామీలు ఇచ్చి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న తీరును ఎండగట్టాలి. వార్డు స్థాయి లో ప్రతి ఇంటికి వెళ్ళి " బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ " కార్యక్రమం నిర్వహించాలి. హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ  ప్రజల పక్షాన  వైయస్ఆర్‌సీపీ పోరాటం చేసింది కాబట్టే తల్లికి వందనం లాంటి పథకాలు అరకొరగా అయిన ఇచ్చా.  వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి నాయకులు , కార్యకర్తలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం విఫలం చెంది ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ ప్ర‌భుత్వం చేస్తున్న మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి` అని కేకే రాజు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర రావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు, వావిలపల్లి ప్రసాద్, బర్కత్ అలీ, కె.వి.యన్ శశికళ, సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్లు జి.వి రమణి, పామోటి బాబ్జి, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, నీలి రవి, దుప్పలపూడి శ్రీనివాసరావు, బల్లా శ్రీనివాసరావు, గుడ్ల అశోక్ రెడ్డి, బొడ్డెటి కిరణ్, బీశెట్టి ప్రసాద్, బలిరెడ్డి గోవింద్, సుకుమార్, ఐ.రవికుమార్, వేణు, మాజీ డైరెక్టర్లు పైడి శ్రీను, దిడ్డి రమేష్, నూకరాజు, ప్రసాద్, మధు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top