రాష్ట్రానికి బీజేపీ సహకరించాలి

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య
 

వైయస్‌ఆర్‌ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బీజేపీ సహకరించాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య కోరారు. దివాళలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గాడిలో పెడుతున్నారని చెప్పారు. 370 ఆర్టికల్‌కు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. బాబు అనుమతి లేకుండానే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో దళారీలను బాబు పెంచి పోషించారని దుయ్యబట్టారు. టీడీపీ వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. 
 

Back to Top