శ్రీకాకుళం జిల్లాలో వైయ‌స్ఆర్‌ సీపీ నేత దారుణ హత్య

శ్రీకాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గార మండల ఉపాధ్యక్షుడు రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన గ్యాస్‌ గొడౌన్‌ వద్దకు మార్నింగ్ వాక్ గా వెళుతున్న సమయంలో దుండగులు ఆయన్ను హతమార్చారు. పల్సర్‌ బైక్‌పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. ఘటనలో రామశేషు అక్కడికక్కడే మృతిచెందారు. రక్తపు మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు రోదించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. హత్యకు కారణాలేమై ఉంటాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడు, స్థానిక వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

Back to Top