శ్రీకాకుళం : శవ రాజకీయాలకు చంద్రబాబు మారు పేరని వైయస్ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు అంత దుర్మార్గమైన, అవకాశవాద రాజకీయ నాయకుడు మరొకరులేరని పక్క రాష్ట్ర సీఎం అన్నారని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి బానిస రాజకీయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, వారితో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పామని స్పష్టం చేశారు.