వైయ‌స్ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్..

ప్ర‌కాశం: కమ్మపాలెం ఉద్రిక్తత నేపథ్యంలో   వైయస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు  అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. కమ్మపాలెంలోకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాకూడదని టీడీపీ నేతల హుకుం జారీ చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేయగా పలువురు గాయపడ్డారు.

Back to Top