నారాయణ రెడ్డి హత్యపై కోట్లా..సమాధానం చెప్పు

 వైయ‌స్ఆర్‌సీపీ నేత బీవై రామయ్య
 

 కర్నూలు :   చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి సమాధానం చెప్పాలని  వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడు బీవై రామయ్య  డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా కేఈ, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుటుంబాల మధ్య ఎందరో నలిగిపోయారు. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పి కోట్ల.. ఓట్లు అడుగుతారని ఆయ‌న‌ ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వేసే ఒకటి రెండు సీట్ల భిక్ష కోసం కోట్ల.. జిల్లా రైతాంగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడం విచారకరమన్నారు. నిజంగానే కోట్ల కుటుంబానికి రైతుల మీద ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై ఎందుకు పొరాటం చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన స్వార్థం కోసం రైతుల పేరు అడ్డుపెట్టుకోవడం కోట్ల దిగజరారుడుతనానికి నిదర్శనమని రామయ్య మండిపడ్డారు.

2014, ఆగస్టు 15న చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు జీవనాడి అయిన గుండ్రేవుల, వేదవతి పనులు చేయకపోగా.. హంద్రీనీవా నుంచి చెరువులకు చుక్క నీరు కూడా ఇవ్వలేదంటూ మం‍డి పడ్డారు. కర్నూల్‌ స్మార్ట్‌ సిటీ, ఆలూరు జింకల పార్క్‌, ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌​ పార్క్‌, నియోజకవర్గాల్లో గోడౌన్ల నిర్మాణం వంటి పనులు ఏం జరగలేదని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూల్‌ జిల్లాలో 60 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. నీతివంతులం అని చెప్పుకుంటున్న నాయకులు వాటిపై నోరు కూడా విప్పలేదని ధ్వజమెత్తారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు చేసిందేమిటో బహిరంగా చర్చకు రావాలని కోట్లను డిమాండ్‌ చేశారు. నోరు తెరిస్తే నీతి, నిజాయతీ, విలువలు అంటూ ఊదరగొట్టే కోట్ల కుటుంబం నేడు వాటి విలువలను నడిబజార్లో విప్పేశారని మండి పడ్డారు.

 

Back to Top