ఓట్ల లెక్కింపు ప్రక్రియకు  వైయస్‌ఆర్‌సీపీ సర్వసన్నద్ధం

టీడీపీ అక్రమాలు ఎదుర్కొనేలా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులకు శిక్షణ 

 వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

పోస్టల్‌బ్యాలెట్‌లో అవకతకలు జరిగిన కలెక్టర్‌ పట్టించుకోలేదు

అధికారులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలి

విశాఖలో వైయస్‌ఆర్‌సీపీ  అభ్యర్థుల సమావేశం

విశాఖపట్నం: ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విశాఖ వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని విశాఖపట్నం వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు తెలిపారు.ఓటమి భయంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడితే ఆ పరిస్థితిని  ఎదుర్కొనేలా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తునట్లు తెలిపారు. విశాఖపట్నం సీతమ్మధారలోని ఎంపి,ఎమ్మెల్యే అభ్యర్థులు సమావేశమయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసినకూడా  జిల్లా కలెక్టర్‌ పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అధికారులు నిష్ఫ క్షపాతంగా ఉండాలని, అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా ఉండకూడదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ విశాఖ సౌత్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు.  ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. కౌంటింగ్‌ సమయంలో ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు.లెక్కింపు సమయంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

 

Back to Top