కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యత కల్పించారని వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. సర్పంచ్ పదవీకాలం పూర్తయినా ప్రజా సేవ ఆగకూడదని, అదే స్పూర్తితో ప్రజల మధ్య ఉండాలని పిలుపునిచ్చారు. కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ వార్డు నెంబర్లను కోడుమూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సన్మానించారు. ఈ సందర్భంగా సతీష్ గారు మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్‌ల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు. అయితే గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ సహకారం లేక సర్పంచ్‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గ్రామాల్లో సమస్యలు పెరిగినట్టు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. అధికారులు, అధికార పార్టీ సహకరించకపోయినా ప్రజల పక్షాన నిలబడి సేవలు అందించాలని సర్పంచ్‌లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం లేదని, అప్పటి వరకు సర్పంచ్ హోదాతోనే ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యం పెరిగిందని గుర్తు చేశారు. సర్పంచ్‌లు తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అందరం కలిసికట్టుగా శ్రమించి తిరిగి జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, ధరణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.