గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నుంచి గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో శని,ఆదివారాలు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుపతి, వైజాగ్ జాబ్ మేళా ల్లో 30,473 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో 208 కంపెనీలో జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 210 కంపెనీలు నాగార్జున యూనివర్సిటీ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 26289 ఉద్యోగాలు ఖాళీలున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. 97000 మంది ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు జాబ్ మేళాల ద్వారా యాభై వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, ఉద్యోగం రానివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.