తాడేపల్లి: మోంథా తుపాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారం గ్రామంలో మొంథా తుపాన్ దెబ్బకు నష్టపోయిన మొక్క జొన్న, మిరప పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుఉన్నారు. తక్షణమే సాయం అందించాలి: పెడన ఇంచార్జ్ ఉప్పాల రాము తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము డిమాండ్ చేశారు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు గ్రామాల్లో “మోంథా” తుపాన్ ప్రభావంతో పంటలు తీవ్ర నష్టం చవిచూసిన పొలాలను సందర్శించి రైతాంగాన్ని రాము పరామర్శించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతు తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఉందని, రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు బెండిపేటలో పంటలు పరిశీలించిన ధర్మాన రామ్ మనోహర్ శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస పంచాయతీ బెండిపేట లో మోంథ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులు పంట పొలాలను వైయస్ఆర్‌సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పరిశీలించారు. పాడైపోయిన పంటను పరిశీలిస్తూ టిడిపి ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైయస్ఆర్‌సీపీ నాయకులు గేదెల పురుషోత్తం, రుప్ప అప్పలసూరి , బగ్గు అప్పారావు , పొన్నడ కూర్మారావు, బెండి సంజీవరావు పాల్గొన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పేర్ని కిట్టు పర్యటన మచిలీపట్నం నార్త్ మండలం లో పోతేపల్లి అరిసేపల్లి చిట్టి పాలెం గ్రామాలలో “మోంథా” తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు పరిశీలించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మట్టా నాంచారయ్య, రైతు అధ్యక్షుడు గడిదేసి రాజు, రమేష్, పిప్పళ్ళ నాగబాబు ఉన్నారు.