లోక్‌సభ ఎన్నికల్లో  వైయస్‌ఆర్‌సీపీకి 23  సీట్లు

టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వేలో వైయస్‌ఆర్‌సీపీ హవా..

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైయస్ఆర్  కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. జనవరి నెలలో దేశవ్యాప్తంగా జరిపిన సర్వే వివరాలను ఈ సంస్థ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. మొత్తం ఓట్లలో 49.5 శాతం ఓట్లను వైయస్ఆర్ సీపీ సాధించనున్నదని, టీడీపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 2.6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో  టిఆర్ఎస్ 10 సీట్లు సాధించి తన హవాను కొనసాగించే అవకాశం ఉందని ఆ సర్వేలో పేర్కొన్నారు. 

 

Back to Top