సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లాలి

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మడం లేదు

పదేళ్లపాటు వైయస్‌ జగన్‌ పక్కన నడిచిన అభిమానులే..నేడు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు

ప్రజల అభిమానాన్ని వైయస్‌ జగన్‌ నిలుపుకోగలిగారు

అట్టడుగు వర్గాలను వాళ్ల కాళ్లపై నిలబెట్టడం.. ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే వైయస్‌ జగన్‌ లక్ష్యం 

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ..ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చర్చావేదికలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన విధానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత వైయస్‌ జగన్‌ తప్పని సరి పరిస్థితుల్లో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టారు. ఆ తరువాత ఇప్పుడు చరిత్ర అయింది.  పదేళ్ల ఎదురిత తరువాత ప్రజల హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. 

2014, 2019లో ఒక దశ పూర్తి అయ్యింది. మహానేత వదిలేసి పథకాలను వైయస్‌ జగన్‌ భుజన ఎత్తుకున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినప్పటికీ, ఇంతకు ముందు విజయప్రకాశ్‌ చెప్పినట్లు మైండ్‌ గేములు ఆడినా, అక్రమ కేసులతో జైల్లో పెట్టినా, ఎల్లో మీడియా వండి వార్చిన కథనాలు ఎన్ని చేసినా ప్రజలు వైయస్‌ జగన్‌ను ఓన్‌ చేసుకున్నారు. అందరి అశీర్వాదాలతో 10 ఏళ్ల పాటు ఆయన పక్కన నడిచిన అభిమానులు కార్యకర్తలు అయ్యారు. మీలాంటి వాళ్లు నాయకులైన ఆయన పక్కన నిలిచి అధికారంలోకి తీసుకువచ్చారు. 

ఈ జర్నీలో ఆ తండ్రికి కొడుకుగా అభిమానించిన వాళ్లు ఉన్నారు. వైయస్‌ జగన్‌ నిబద్ధతను చూసి వచ్చిన వారు ఉన్నారు. అప్పటి నుంచి వారసత్వ రాజకీయాలు అని భావించిన వారు కూడా 2014 ఎన్నికల తరువాత వైయస్‌ఆర్‌సీపీలో జాయిన్‌ అయ్యాన వారు ఉన్నారు. మూసకట్టు రాజకీయాలను చూసి విసిగిపోయిన వారు ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత వైయస్‌ జగన్‌ నిబద్ధతను చూసి పార్టీలోకి వచ్చిన వారు  ఇక్కడ ఉన్నారు. ఇదే నిజమైన అభిమానం అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరూ దేనికి అతీతులు కాదు. అలా అభిమానాన్ని నిలుపుకోగలిగిన వ్యక్తిగా, నాయకుడిగా వైయస్‌ జగన్‌ రుజువు చేసుకున్నారు. ఇందులో చాలా మంది గుడ్డి అభిమానంతో వచ్చిన వారు కాదు. అందువల్లే దీనికి విలువ పెరిగిందని భావిస్తున్నాను. వైయస్‌ జగన్‌ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాల మాదిరిగా అధికారాన్ని ఎట్లా నిలుపుకోవాలని, ఐదేళ్ల తరువాత మళ్లీ ప్రభుత్వాన్ని ఎట్టా నిలుపుకోవాలని, ఓట్లు ఎట్టా తెచ్చుకోవాలని  ఆలోచిస్తుంటే ..దానికి ఈ ఎక్సైర్‌సైజ్‌ కూడా అవసరం లేదు. దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేం కూడా ధైర్యం చేసి అందరిని పిలిచేవాళ్ల కాదు. ఏదైనా అభిమానం ఉంటే నేరుగా మాట్లాడుకునేవాళ్లం..లేదంటే ప్రభుత్వానికి అవసరమవుతారనుకుంటే డైరెక్ట్‌గా హ్యాండిల్‌ చేసి మోసపు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో అలా నడిపేవాళ్లం. 

ఈ రోజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న అజెండా ఏదైతే ఉందో ఇది పూర్తి సక్సెస్‌ కావాలన్నా..దీని వల్ల ఎవరైనా సరే రాష్ట్రం, దేశం బాగుండాలని అనుకునే వారికి ఒక హెల్తీ వాతావరణం ఉండాలని భావించే వాళ్లకు ఒక ఎక్సర్‌మెంట్‌ ప్రజాస్వామ్యంలో వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో మొదలైందని భావిస్తున్నాను. సంక్షేమం ద్వారా పూర్తిగా అభివృద్ధి సాధించడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మొదలైందని స్పష్టమవుతుంది. గందరగోళం లేకుండా సూటిగా రెండు మాటలు చెప్పాలి. ఎక్కువగా మాట్లాడితే కన్యూS్ఫజ్‌ అవుతుంది. భవిష్యత్‌లో దానికి అవసరమైన మేధావుల మద్దతు కూడా ఉంటుంది. 

సమ సమాజం సాధిస్తామన్నది ఒక్కటైతే..దీని చేస్తాం అని చెప్పడం, దాన్ని అంచన వేసే వాతావరణం, పరిస్థితిని వైయస జగన్‌ సృష్టించారు. వాతావరణం, నిబద్ధత రెండు కూడా కనిపిస్తున్నాయి.కులాలకు, మతాలకు అతీతంగా అట్టడుగు వర్గాలను వాళ్ల కాళ్లపై నిలబెట్టేందుకు, ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని దాటుకొని పోవాలని దృఢమైన ఆలోచన వైయస్‌ జగన్‌లో కనిపిస్తోంది.  ఇందులో దూరదృష్టి దాగి ఉందని, మన గురించి మంచి చేయాలని అందరికి తెలియకపోవచ్చు. ఆ సృహా ఉంటే తప్ప..మన కాళ్లపై నిలబడాలనే ఆలోచన వాళ్లకు రావాలి. సగటు వ్యక్తి చేసే ఆలోచన కాదు ఇది. అన్ని కుటుంబాలు కూడా మనలాగే ఉండాలని గట్టిగా అనుకునే నాయకుడు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.  అలాంటి ఆలోచన వస్తేనే ఇది కొనసాగుతుంది. ఇక్కడ పార్టీకి సంబంధించిన అంశం ఉంటుంది.  

ఉదాహరణకు నాడు–నేడు పనులు వేల కోట్లతో ఖర్చు చేసి చేపడుతున్నారు. ఆసుపత్రులు కడుతున్నారు. ఇవన్నీ కూడా నాలుగేళ్లలో ఈ కట్టడాలు మళ్లీ శిథిలావస్థకు చేరుతాయి. అమ్మ ఒడి పథకం ఉంది.  పూర్తి నమ్మకంతో విద్యా దీవెన డబ్బులు తల్లుల ఖాతాలో వేస్తున్నారు. ఇంట్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి..ఫీజు కడుతారో లేదో అన్న అపనమ్మకం ఉంటుంది. విద్యా గురించి తెలిస్తేనే దానిపై శ్రద్ధ చూపుతారు. ఈ ఫీజు కట్టకపోతే పిల్లాడి భవిష్యత్‌ పాడవుతుందన్న ఆలోచన రావాలి.ఆత్మ గౌరవం పెరిగేలా కాలేజీకి వెళ్లి అడిగే హక్కు జగనన్న  ఇచ్చారనే సృహతో కొందరు ఫాలో అవుతుంటారు.

తొలి దశలో 15 వేల స్కూళ్లలో నాడు–నేడు పథకం ద్వారా పనులు చేపడుతున్నారు. కొత్త అభివృద్ధి కావాలంటే దీనిపై నిరంతరం చర్చ జరగాలి. ప్రత్యార్థులు ఈ పథకాలపై ఆలోచన చేయడం లేదు. అప్పులు చేస్తున్నారు..అధికార దుర్వినియోగం అంటున్నారు. లక్ష 34 వేల ఉద్యోగాలు ఇచ్చారని వారే చెబుతారు. మళ్లీ వాళ్లే ఉద్యోగాలే ఇవ్వడం లేదంటారు. రెగ్యులర్‌ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ మొన్న విడుదల చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రిఫైర్‌ అవుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని క్యాలెండర్‌ విడుదల చేశాం. ఈ ఏడాది రాలేదన్న నిరాశ ఉన్నా..వచ్చే ఏడాది సాధిస్తామన్న ఆలోచన వస్తుంది.

ఐదేళ్లలో చంద్రబాబు 34 వేల ఉద్యోగాలు ఇస్తే..ఏడాదిలోనే 1.34 లక్షల ఉద్యోగాలు, ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగాలు వైయస్‌ జగన్‌ ఇచ్చారు. ఒక స్థిరమైన నమ్మకం కల్పించాలని, ప్రభుత్వం భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు.  ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు వివరణ ఇవ్వడానికే సరిపోతుంది.

గతంలో రైతు ఎలా ఉండేవాడు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఎన్నాళ్లకు వచ్చేది. ఇప్పుడు ఏ సీజన్లోనిది అదే సీజన్‌లో ఇస్తున్నాం. ఇన్సూరెన్స్‌ రెడీ కాకపోతే ప్రభుత్వమే ఇస్తోంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం  చెల్లించింది. రైతు కుటుంబాలకు ఆలోచించే వెసులుబాటు రైతు భరోసా పథకం ద్వారా వచ్చింది. ఈ రోజు కాపు నేస్తం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. గతంలో బ్యాంకులు జమ చేసుకునేవాళ్లు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా లబ్ధిదారులు పొందేలా నిబంధనలు పెట్టారు. ఇంతగా ఆలోచించడం వైయస్‌ జగన్‌కే సాధ్యమైంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. సారం, సారాంశం అంతా కూడా మా బతుకుల బాగుకోసమే అని వారు అర్థం చేసుకోగలిగితే..ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆలోచనే తప్పు అంటే ఎలా..ఇందులో తప్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటి గురించి ఆలోచన చేస్తాం. 

ఓట్ల కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కొత్త రాజకీయం..మనం కూడా కొత్తగా ఆలోచన చేయాలి. గతంలో లాగా ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. అన్ని ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద, చర్చా వేదికల్లో విమర్శకుల నోరు మూయించేలా ఒక మాటలోనే సమాధానం చెప్పవచ్చు. 

గత ప్రభుత్వం మాదిరిగా అడ్డగోలుగా చేయకుండా, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న దానికి భిన్నంగా నేడు పాలన సాగిస్తున్నారు. గతంలో మోసం చేసిన వారే ప్రభుత్వం నుంచి దిగిపోయిన ఆరు నెలలకే అటాక్‌ మొదలుపెట్టారు. వాళ్ల డీఎన్‌ఏలోనే మీడియా ఒక పార్ట్‌గా మారింది. మనవాళ్లు కూడా ఆలోచించే విధంగా కథనాలు వండి వార్చుతున్నారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధి ఒక్కవైపు ఉంటే..దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే వాళ్లు మీరు. 

రఘురామరాజును పావులాగా మార్చుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఇలాంటి కుట్రలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. లాజికల్‌గా ఆలోచించేవాళ్లు, బయటి వాళ్లు కూడా అలాగే ఆలోచన చేస్తారు. నిన్న మైసూరారెడ్డి కూడా ఇలాగే మాట్లాడారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా నీళ్లు తోడెస్తున్నా ..ఎప్పుడూ మాట్లాడలేదు. వైయస్‌ జగన్‌ పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే విపక్షాలు కలిసి రావాల్సిన పరిస్థితి లేదు. రాయలసీమకు న్యాయం చేయాలనుకున్న వారు ఎవరైనా సరే వైయస్‌ జగన్‌కు మద్దతు తెలుపుతారు. వితండవాదం చేసేవాళ్లకు ఏం చెప్పలేం. 

పార్లమెంట్‌ సమావేశాల్లో మన పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. వ్యవస్థీకృతమైన ఆర్గనైజేషన్‌ వస్తుందని భావించడం లేదు. మిగిలిన వాళ్లు కూడా కింది వరకు ఆలోచన చేస్తే, సోషల్‌ మీడియాలో తమ ఆలోచనలు పంచుకోగలిగితే, లేదా కిందిస్థాయిలో చర్చలు, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తే కొంత వరకు సక్సెస్‌ అవుతుంది. ఇలా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ఉంటే చెప్పండి. జనాల్లో పాజిటివ్‌ డిస్కర్షన్‌ తీసుకురాలేకపోతే..ఆ లోటు పూడ్చడంలో పార్టీ శ్రేణులు డౌట్లు తీర్చాలి. అందరికి అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలి. అవతలి వారు చేసే వాటిని తిప్పి కొట్టాలి. 

ప్రత్యర్థి పార్టీ మీడియా పోకస్‌డ్‌గా వెళ్తోంది. టెక్నాలజీ పెరిగింది. 24 గంటలు సోషల్‌మీడియా అందుబాటులో ఉంది. నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. కిందిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి నెలకు  ఒకసారి మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిరంతరం జరగాలి. పాజిటివ్‌ సైడ్లో ఆలోచన చేయాలి. నిర్మాణాత్మకంగా పార్టీలో పని చేయాలి.  అందరం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రయణం ఇప్పుడే మొదలైంది. అందరి సలహాలు, సూచనలు పాటిస్తే సక్సెస్‌ అవుతాం. ఇంత బాగా చేస్తున్నా కూడా ..వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీన్ని దాటడానికి ఏం చేయాలన్న దానిపై నిర్మాణంపై ఆలోచన చేయాలి. ఏ ఫామ్‌లో ముందుకు వెళ్లాలో ప్రణాళిక రూపొందించుకోవాలి.  ఇదివరకే ఉన్న వారిని ఎలా ఉపయోగించుకోవాలి.  లోకల్‌ చానల్స్‌ను ఉపయోగించుకోవాలి. లీగల్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top