వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుంది

మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 
వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా పార్టీ ఆవిర్భావ వేడుక‌లు

తాడేప‌ల్లి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day)  బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైయ‌స్‌ జగన్‌.. మహానేత  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. 

వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

వైయ‌స్ఆర్‌సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు.  అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.

వైయ‌స్ జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది.  3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే.  పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా పార్టీ  శ్రేణుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top