కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు భ‌క్త క‌న‌క‌దాస‌

భక్త కనకదాస జ‌యంతి సందర్భంగా వైయ‌స్ జగన్ నివాళి 

తాడేపల్లి: భక్త కనకదాస జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్త‌న‌ల‌తో క‌విత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త కనకదాస జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top