రైతుల మోటార్ల వైర్లు అపహరణ

లింగాల పీఎస్‌ ముందు ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి ధర్నా 

వైయ‌స్ఆర్‌ జిల్లా: వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి లింగాల పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి ఆందోళన చేపట్టారు. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంటనే నిందితులను పట్టుకుని రైతులకు న్యాయం చేయాలని వైయ‌స్ అవినాష్‌రెడ్డి  డిమాండ్ చేశారు.

Back to Top