శ్రీ క‌న‌క‌దాస మార్గనిర్దేశాలు మనందరికీ ఆదర్శం

మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య

క‌ళ్యాణ‌దుర్గంలో ఘనంగా శ్రీ భక్త కనకదాస‌ జయంతి వేడుకలు

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: క‌న‌క‌దాస మార్గ‌నిర్దేశాలు మ‌నంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య కొనియాడారు. కళ్యాణదుర్గం పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో శ్రీ భక్త కనకదాస్ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  రంగ‌య్య మాట్లాడుతూ..భక్త కనకదాసు​ సమాజంలోని అసమానతలు మీదా తన కవిత్వాల ద్వారా గొప్ప సందేశాలు అందించారన్నారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, మునిసిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్, కౌన్సిలర్లు,  మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడగట్ట నారాయణ, బిక్కి హరి నాగలక్ష్మి,ఎంపీపీలు మారుతమ్మ ఆంజనేయులు, భీమేష్, చంద్రశేఖర్ రెడ్డి, మండలాల కన్వీనర్లు ఐ సుధీర్, గోళ్ళ సూరి,  MS హనుమంత రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, కురుబ హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, వికలాంగుల విభాగం అధ్యక్షులు కురుబ పాతలింగ, మండల ఉపాధ్యక్షులు మల్లి, ఐపార్సపల్లి భాస్కర్, యూత్ వింగ్ కన్వీనర్ చరణ్, బూత్ కమిటీ కన్వీనర్ దొడ్ల తిప్పేస్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Back to Top