చంద్రబాబు నిర్ణయాలు వల్లే రైతులకు విత్తన కష్టాలు 

రైతుల గురించి చంద్రబాబు ఎన్నడూ ఆలోచించలేదు..

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుంది

వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్‌ నాగిరెడ్డి

విజయవాడః చంద్రబాబు తీరువల్లే రైతులు విత్తన కష్టాలు ఎదుర్కొంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగంఅధ్యక్షులు ఎంవిఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. ఆయన విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నెలాఖరుకే విత్తన సేకరణ పూర్తికావాలని.. విత్తన సేకరణపై దృష్టి పెట్టకుండా చంద్రబాబు రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేందుకు చంద్రబాబు పరుగులు పెట్టారే తప్ప రైతులు  గురించి ఆలోచించలేదన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్లనే వేరుశనగ విత్తనాల సేకరణలో జాప్యం జరిగిందన్నారు.

వైయస్‌ జగన్‌ ఆదేశాలతో రైతులకు బాసటగా నిలుస్తామని తెలిపారు. ఏపీలో వరి తర్వాత అత్యధిక సాగు జరిగేది వేరుశనగ పంట అని,  ఎకరానికి అత్యధికంగా విత్తనం కావాల్సింది కూడా వేరుశనగ పంటకేనని..గత ప్రభుత్వ మే నెల వచ్చేవరుకు విత్తనాలను సేకరించలేదన్నారు. సేకరణపై దృష్టి పెట్టకుండా..ఎలక్షన్‌ కమిషన్‌తో తగాద పెట్టుకుంటూ ..రివ్యూలంటూ  కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలనే ఆలోచనే తప్ప  రైతులకు చెల్లించని 2,200 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీపై కనీసం ఒక రివ్యూ మీటింగ్‌ కూడా పెట్టలేదన్నారు. గత ప్రభుత్వం 2015–16  నుంచి 2018–19 వరుకు విత్తన కంపెనీలకు 384 కోట్లు బకాయిలు పడిందన్నారు.

బకాయిలు చెల్లించకపోవడంతో విత్తనాలు అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు.. రైతులు గురించి ఆలోచన చేయకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం  చేశారన్నారు.నేడు చంద్రబాబు రైతులపై ప్రేమను ఒలకబోస్తున్నారన్నారని దుయ్యబట్టారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం బకాయిలను విత్తన కంపెనీలకు చెల్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు.చంద్రబాబు వాస్తవాలను మరిచిపోయి మాట్లాడుతున్నారని తనమోసాలను ప్రజలు గమనించట్లేదని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఏనాడు రైతులు,గిట్టుబాటు ధరలు గురించి ఆలోచించలేదని..అందుకే చంద్రబాబు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.

Back to Top