టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు

ప్రచార రథం దగ్ధంపై సమగ్ర విచారణ

మాజీ ఎంపీ మార్గాని భరత్‌

రాజమండ్రి: టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ మండిపడ్డారు. ప్రచార రథం దగ్ధం ఘటనపై టీడీపీ చేస్తున్న అసత్యాలను మాజీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచార రథం దగ్గం చేసినæనిందితుడిని మా వద్దకు పంపి కోవర్టు ఆపరేషన్‌ చేశారన్నారు. నిందితుడు వైయస్‌ఆర్‌సీపీ అని ఎలా ఆపాదిస్తారని నిలదీశారు.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని భరత్‌ డిమాండ్‌ చేశారు. నిందితుడి బంధువులంతా టీడీపీకి చెందిన వారే అని స్పష్టం చేశారు. మార్కెండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి సిద్ధమా అని మార్గాని భరత్‌ సవాలు విసిరారు. సదరు వ్యక్తి మూడు గంటలు అక్కడే మద్యం తాగాడా?. ఎలా ఒక్కడే పెట్రోల్ తీసుకొచ్చి వాహనానికి నిప్పంటిస్తాడు. అతడికి మాపై అభిమానం ఉంటే మా ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారు. మోరంపూడి శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులు పూర్తిగా పరువు కోల్పోయారు. అందుకే నాపై ఈ ఘటనతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో ఇప్పటివరకు ఇంతటి దుర్మార్గమైన పనులు ఎక్కడ జరగలేదు. ప్రచార రథం దగ్ధంపై సమగ్ర విచారణ జరగాలని మార్గాని భ‌రత్  కోరారు. 
 

Back to Top