మన్యం జిల్లా: పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు. సాలూరులో జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని గ్రామ, వార్డు స్థాయి నుంచే మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని, ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ రానున్న రోజుల్లో సముచిత స్థానం, బాధ్యతలు తప్పక కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, గ్రామ–వార్డు కమిటీల ఏర్పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తప్పకుండా తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని, అందుకోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ, గ్రామ–వార్డు స్థాయి నుంచే కమిటీలను బలోపేతం చేసి, పార్టీని ప్రజల్లో మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే పార్టీ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైయస్ఆర్ సీపీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో గ్రామ, వార్డు కమిటీల సభ్యుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కేడర్ పటిష్టతే పార్టీ బలమని పేర్కొన్నారు. అరకు పార్లమెంట్ (మన్యం జిల్లా) వైసీపీ పరిశీలకులు చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ, వార్డు స్థాయిలో వైసీపీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జడ్పీ వైస్ చైర్మన్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి బాపూజీ నాయుడు మాట్లాడుతూ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తిగా పార్టీకి అంకితమైన శ్రేణులనే కమిటీల్లోకి తీసుకుని క్యాడర్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, మక్కువ జడ్పీటీసీ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మన్యం జిల్లా పార్టీ పరిశీలకులు శరగడం చిన అప్పలనాయుడు, జడ్పీ వైస్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి, సాలూరు–చీపురుపల్లి నియోజకవర్గాల పరిశీలకులు మరిశర్ల బాపూజీ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి, కురుపాం–పార్వతిపురం నియోజకవర్గాల పరిశీలకులు మావుడి శ్రీనివాస్ నాయుడు, టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు, మాజీ మంత్రి బాలరాజు, మన్యం జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీను, సాలూరు మున్సిపల్ చైర్మన్ పువ్వుల ఈశ్వరమ్మ, పాచిపెంట మండల వైసీపీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, సాలూరు అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనివాసరావు, మెంటాడ అధ్యక్షులు రాయిపల్లి రామారావు, సాలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.