టీడీపీ సోష‌ల్ మీడియా దుష్ప్ర‌‌చారంపై డీజీపీకి ఫిర్యాదు

 సాహో చంద్ర‌బాబు ఫేస్‌బుక్‌పై వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు

తాడేప‌ల్లి: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ సోషల్‌ మీడియా దుష్ప్ర‌చారంపై వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు. సాహో చంద్రబాబు ఫేస్‌బుక్ ఫేజీ నారా లోకేష్‌ స్వీయ పర్యవేక్షణలో న‌డుస్తుంద‌ని, కావాల‌నే వైయ‌స్ఆర్ సీపీపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని డీజీపీ దృష్టికి తీ‌సుకెళ్లారు.  ఆ లేఖ ఇలా.. 

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సోషల్ మీడియా (ఫేస్బుక్) వేదికగా సాహో చంద్రబాబు పేరుతో వై.యస్.ఆర్.సి.పి. పార్టీ నాయకులైన మంత్రిపెద్దిరెడ్డి,  ఎంపీ వేమిరెడ్డి, కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు, సెజ్ కోసం భూములు లాక్కుంటారు. మేము ఏమి చేయలేము. ఓడిపోతే వెనక్కి తగ్గుతారు” అని గూడూరు, సూళ్ళురుపేట, సత్యవేడు శాసనసభ్యులు తమ ప్రధాన అనుచరులకు చెబుతునట్లు తప్పుడు కథ‌నాలు ప్రచురించి సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల‌ 17వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నికలలో వై.యస్.ఆర్.సి.పి. పార్టీని నష్టపరిచే విధంగా నాయకులను ఓటర్లను ప్రభావితం చేయుటకు అసత్య ,  తప్పుడు ప్రచారంతో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల పేరుతో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ మీడియా (ఫేస్బుక్) ఎకౌంట్లు ఎన్నికల ప్రవర్తనా నియామవళికి ,రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1951కి విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

కావున ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , ఫేస్బుక్ ఎకౌంట్ పర్యవేక్షిస్తున్న సంబంధిత నిర్వాహకులపై విచారణ జరిపి చట్టరిత్యా తగు చర్యలు తీసుకోవాల‌ని ఫిర్యాదులో లేళ్ల అప్పిరెడ్డి డీజీపీని కోరారు. 

Back to Top