నెల్లూరు కార్పొరేష‌న్‌.. వైయ‌స్ఆర్ సీపీ క్లీన్ స్వీప్‌

నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అన్ని స్థానాల్లో గెలుపొంది ఎన్నికలను క్లీన్‌స్వీప్‌ చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. కార్పొరేషన్‌లోని 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 46 చోట్ల వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైయ‌స్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు కార్పొరేష‌న్‌ను క్లీన్ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది.

తాజా ఫోటోలు

Back to Top