నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్ధులు మృత్యువాత..వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి 

తాడేప‌ల్లి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి ఆరుగురు ఐదో తరగతి విద్యార్ధులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ అన్నారు. ఈత కోసం వెళ్ళిన విద్యార్ధులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్ధులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Back to Top