వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గౌతమ్‌రెడ్డి సంతాప సభ

తాడేపల్లి: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభ తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పార్టీ బలోపేతానికి చేసిన సేవలను నేతలు కొనియాడారు. గౌత‌మ్‌రెడ్డి మ‌ర‌ణం వైయ‌స్ఆర్‌సీపీకి తీర‌ని లోటు, ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని నేత‌లు కోరారు.
 

Back to Top